Saturday, November 23, 2024

అమర్‌రాజా కంపెనీని మేమే పొమ్మన్నాం: సజ్జల

ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రూ.3 లక్షల కోట్లకు తోడు కరోనా సంక్షోభం తోడు కావడంతో అప్పులు మరింత పెరిగాయన్నారు. తాము కొన్ని నిధులను సంక్షేమ పథకాలకు వెచ్చించడం వల్ల ఆర్థిక సమస్యలు ఎక్కువ అయ్యాయని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్పులు చేయడం లేదా అని సజ్జల ప్రశ్నించారు. మరి బీజేపీ చేస్తే ఒప్పు.. తాము చేస్తే తప్పా అని కేంద్రాన్ని నిలదీశారు.

మరోవైపు అమర్ రాజా బ్యాటరీ సంస్థను తమ ప్రభుత్వమే పొమ్మంటోందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అమర్ రాజా కంపెనీ వల్ల విష పదార్ధాలు వస్తున్నట్లు హైకోర్టు ధృవీకరించిందని తెలిపారు. బ్యాటరీ సెక్టార్‌లో రెండో అతిపెద్ద సంస్థ అయిన అమర్ రాజా.. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందింది. ప్రస్తుతం తమ సంస్థలో ప్రస్తుతం 15 వేల మంది ఉపాధి పొందుతున్నారని, రాష్ట్రానికి 1200 కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

ఈ వార్త కూడా చదవండి: సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాలు విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement