హీరో సాయిధరమ్ తేజ్ మాదాపూర్లోని కేబుల్ బ్రిడ్జి వంతెనకు సమీపంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్పై వెళ్తున్న సాయితేజ్ రోడ్డుపై ఇసుక ఉండడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. హెల్మెట్ ధరించడంతో సాయితేజ్ ప్రాణాపాయం నుంచి తప్పించుకుని గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మట్టి వల్ల ఈ ప్రమాదంలో హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదం బారిన పడడంతో జీహెచ్ఎంసీ మేల్కొంది. ప్రత్యేక చర్యలు చేపడుతూ రోడ్లన్నింటినీ శుభ్రం చేయిస్తోంది. ముఖ్యంగా భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేస్తున్న వారిపై జీహెచ్ఎంసీ కొరడా ఝులిపిస్తోంది. మాదాపూర్ ఖానామెట్ పరిధిలో భవన నిర్మాణం చేపడుతున్న అరబిందో కన్స్ట్రక్షన్కు జీహెచ్ఎంసీ లక్ష రూపాయల జరిమానా విధించింది. ఆ సంస్థ చేస్తున్న నిర్మాణ పనుల వల్ల మట్టి, ఇసుక రోడ్లపై పడుతుండడంతో జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు సత్వర చర్యలు తీసుకున్నారు.