ప్రమాణం చేయించిన గవర్నర్ దత్తాత్రేయ
హాజరైన మోదీ, అమిత్, చంద్రబాబు
జేపీ నడ్డా, గడ్కరి, రాజ్ నాథ్ సింగ్
చండిగఢ్ – హర్యానా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. భారతీయ జనతా పార్టీ వరుసగా మూడోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి బీసీ నేత నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. సైనీతో గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణం చేయించారు. సైనీతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.
పంచకులలోని సెక్టార్ 5లో గల దసరా గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, మనోహర్ లాల్ ఖట్టర్, నితిన్ గడ్కరీ, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరయ్యారు.