Wednesday, November 20, 2024

పెళ్లికి ఇంకా టైమ్ రాలే.. క్లారిటీ ఇచ్చిన సాయిప‌ల్ల‌వి..

ఇటీవలే ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సాయి పల్లవి.. తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో తన పెళ్లి విషయమై ఓపెన్ కామెంట్స్ చేసింది. రంగుల ప్రపంచంలో స్టార్ స్టేటస్ పట్టేసిన తారల పెళ్లి ముచ్చట్లు అనగానే ప్రేక్షకులకు ఎనలేని ఆసక్తి. తమ అభిమాన తారలు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు? పెళ్లి తర్వాత వారి ప్లాన్స్ ఏంటి అనే దానిపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు ఆడియన్స్. అందుకే ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న హీరోహీరోయిన్లకు ఎక్కడోచోట పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే రీసెంట్‌గా జరిగిన ఓ మీడియా సమావేశంలో ఇదే ప్రశ్న ఎదురుకావడంతో సాయి పల్లవి తన పెళ్లి విషయమై నోరువిప్పింది.

తనదైన నటనకు తోడు డాన్స్, హావభావాలతో కెమెరా ముందు లేడి పిల్లలా దూకుతుంటుంది సాయి పల్లవి. ఆ ఎనర్జీని లెక్క కట్టడం అసాధ్యం అన్నట్లుగా హై స్పీడ్ పర్‌ఫార్‌మెన్స్‌తో కట్టిపడేయడం ఈ పక్కింటమ్మాయి నైజం. దక్షణాదికి ప్రేక్షకులను ఫిదా చేస్తూ పలు భాషల్లో వరుస ఆఫర్స్ పట్టేస్తున్న ఈ బ్యూటీ ఇటీవలే తెలుగులో శ్యామ్ సింగ రాయ్ రూపంలో భారీ హిట్ పట్టేసింది. నానితో తెరపంచుకున్న ఆమె విమర్శకుల ప్రశంసలందుకుంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ చేపడుతుండగా మీ పెళ్ళెప్పుడు? అనే ప్రశ్న సాయి పల్లవికి ఎదురైంది. దీంతో దీనిపై రియాక్ట్ అయిన ఆమె.. పెళ్లి ఆలోచన ఇప్పుడు లేదని, 30 ఏళ్లు దాటాకనే పెళ్లి గురించిన ప్రపోజల్స్ పరిశీలిస్తానని ఓపెన్‌గా చెప్పేసింది. (ప్రస్తుతం ఆమె వయస్సు 29 సంవత్సరాలు) అప్పటిదాకా తన ఫోకస్ అంతా సినిమాల పైనే ఉంటుందని, విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తానని అంటోంది సాయి పల్లవి. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్‏లలో ఒకరిగా కొనసాగుతున్న ఆమె.. రానాతో ‘విరాటపర్వం’ మూవీ చేస్తూనే తమిళంలో మరో మూవీలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా అతిత్వరలో రిలీజ్ కానున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement