Saturday, October 5, 2024

Sai Pallavi – ఇక మ‌న తెలంగాణ హైబ్రీడ్ పోరి డాక్ట‌రైంది…

హీరోయిన్ సాయిపల్లవి పేరు చెప్పగానే నేచురల్ బ్యూటీ అనే పదమే గుర్తొస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు పలు భాషల్లో చాలానే సినిమాలు చేసింది గానీ గ్లామర్, రొమాన్స్‌ విషయంలో గీత దాటలేదు. ఇకపోతే చాలామంది డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యానని అంటుంటారు. కానీ ఈమె మాత్రం రెండింటిని భలే మేనేజ్ చేస్తూ వచ్చింది. తాజాగా ఆమె ఎమ్‌బీబీఎస్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది.

తమిళనాడుకు చెందిన సాయిపల్లవి చిన్నప్పుడే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. తెలుగులో డ్యాన్స్ షోలోనూ పార్టిసిపేట్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు ఎంబీబీఎస్ చేస్తూనే మరోవైపు నటిగానూ అవకాశాలు దక్కించుకుంది. ప్రేమమ్ తో మలయాళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. తెలుగులోనూ ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ తదితర చిత్రాలతో బోలెడంత ఫేమ్ సొంతం చేసుకుంది.

- Advertisement -

ఇక జార్జియాలోని మెడిక‌ల్ క‌ళాశాల‌లో ఎంబిబిఎస్ పూర్తి చేసిన సాయిప‌ల్ల‌వి రెండు రోజుల క్రితం జార్జియా వెళ్లి తాను చదివిన యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పట్టా స్వీక‌రించింది. గ్రాడ్యుయేషన్ డే రోజు తన కాలేజీలో ఫ్రెండ్స్ తో సరదాగా గడిపింది. దీంతో అక్కడ సాయి పల్లవి గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇపుడు సాయి పల్లవి కాదు డాక్టర్ సాయి పల్లవి అనాలి అని అంటున్నారు అభిమానులు. మరి సాయి పల్లవి ఫ్యూచర్ లో హాస్పిటల్ కడుతుందా, డాక్టర్ గా పనిచేస్తుందా చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement