షిరిడి, ఆంధ్రప్రభ : సాయిబాబా సమాధిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో సాయి భక్తులు వస్తుంటారు. అయితే నిన్న (గురువారం) అధికారులు బాబా పల్లకీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పల్లకీని ఏర్పాటు చేయడానికి కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డు వినోద్ తుర్కనే బాధ్యత వహించారు.
అయితే, వేడుకలో పల్లకీ చివర, కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డు వినోద్‌కు చావడి దగ్గర పర్సు దొరికింది. పర్సులో 17,850/- నగదు ఉండడంతో పర్సును ప్రొటెక్షన్ కార్యాలయంలో జమ చేశాడు. ఆ పరుసు ఆంధ్రా ప్రాంతానికి చెందిన సాయి భక్తురాలు పి.భారతి ప్రకాశన్‌కు చెందినదని గుర్తించిన అధికారులు తిరిగి ఇచ్చేశారు.
ఈ సందర్భంగా సాయిబాబా సంస్థాన్ నిర్వాహకులకు సాయి భక్తులు కృతజ్ఞతలు తెలుపుతూ, పోగొట్టుకున్న డబ్బు తిరిగి రావడంతో సాయిబాబాపై తమకున్న విశ్వాసం బలపడిందన్నారు. నిజాయతీపరుడైన సెక్యూరిటీ మేన్ వినోద్ ను సముచితంగా సత్కరించారు.