హైదరాబాద్, ఆంధ్రప్రభ : నాగార్జునసాగర్ వరద స్థిరంగా కొనసాగుతోంది. వస్తోంది తక్కువ వరదే అయినప్పటికీ మూడు రోజులుగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయిలో నిండడంతోపాటు కుడి, ఎడమ కేంద్రాల్లో జలవిద్యుదుత్పత్తి చేస్తుండడంతో దాదాపు 59, 444 క్యూసెక్కుల వరద నాగార్జునసాగర్‌కు చేరుతోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో నీటి మట్టం 198.90 టీఎంసీలకు చేరింది. 1000 క్యూసెక్కులను దిగువన ఆయకట్టుకు వదులుతున్నారు.
మరోవైపు శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద ఉధృతి తగ్గిది. కేవలం 68, 328 క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చి చేరుతోంది. శనివారం వరకు లక్ష క్యూసెక్కుల వరద రాగా… ఎగువన ఆలమట్టి, నారాయణపూర్ నుంచి వరద ఉధృతి క్రమంగా చాలా వరకు తగ్గింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీంఎసీలు కాగా… ప్రస్తుతం 197.01 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.
శ్రీరాంసాగర్‌కు స్థిరంగా వరద…
గోదావరిపై ఉన్న ప్రధాన సాగునీటిప్రాజెక్టు శ్రీరాంసాగర్‌కు వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి 86270వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు గేట్ల ను ఎత్తిన అధికారులు దిగువకు 85వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 75. 15 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి 2లక్షల 12వేల క్యూసెక్కుల నీరును దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 16, 625 క్యూసెక్కుల వరద వస్తోంది. దిగువకు 13, 500 క్యూసెక్కుల నీరు వెళ్లిపోతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.