Thursday, November 21, 2024

AP | 12న ప్రకాశం జిల్లాకు సాగర్‌ జలాలు.. చెరువులు నింపేందుకు చర్యలు

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం నాగార్జున సాగర్‌ జలాలు విడుదల చేసిందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఈనెల 6వ తేదీన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించడంతో ప్రకాశం, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలోని తాగునీటి చెరువులను నింపేందుకు ఈ నీటిని విడుదల చేస్తునట్లు చెప్పారు. ఇందుకోసం 5 టీఎంసీల నీటిని కుడికాలువ ద్వారా ఈనెల ఏడో తేదీన విడుదల చేశారని గుర్తుచేశారు.

ప్రకాశం జిల్లా సరిహద్దు పుల్లలచెరువు మండలం మానేపల్లి 85 (3) మైలు వద్దకు ఈ నెల 12వ తేదీకి సాగర్‌ జలాలు ప్రకాశం జిల్లాలో ప్రవేశిస్తాయని తెలిపారు. ఈ నీటి ద్వారా జిల్లాలోని నీటి ఎద్దడి ఉన్న ఆర్డబ్ల్యూఎస్‌, మున్సిపాలిటీలకు సంబంధించిన అన్ని త్రాగునీటి చెరువులను నింపాలని, చెరువుల్లో సాగర్‌ నీరు నింపే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీటి చెరువుల్లో నీటిని నింపిన తర్వాత వాటి వినియోగం విషయంలో కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకొని మూడు లేదా నాలుగు నెలల పాటు ఈ నీటిని వినియోగించుకునే విధంగా నిల్వ చేయాలని మంత్రి సురేష్‌ కోరారు. ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement