నాగార్జునసాగర్ బైపోల్ నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ శశాంక్ గోయల్ తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ కూడా మంగళవారమే ప్రారంభం కానుండగా, ఈనెల 30వ తేదీవరకు స్వీకరణ ఉంటుంది. ఏప్రిల్
17న ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ అభ్యర్ధిగా జానారెడ్డిని ఇప్పటికే ప్రకటించగా, టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థిపై మంగళవారం స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ వివిధ సామాజిక సమీకరణలు, లెక్కలు పరిశీలిస్తోంది.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మొత్తం 2,19,745 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,08,907 మంది పురుషులు ఉండగా.. 1,10,838 మంది మహిళలు ఉన్నారు.