నల్లగొండ, ప్రభన్యూస్ : నాగార్జున సాగర్‌కు వదర పోటెత్తోంది. నేడు (మంగళవారం) సాయంత్రం ప్రాజెక్టు అన్ని 24 గేట్లను ఎత్తి వేశారు. ప్రస్తుతం సాగర్ కు 2,50,629 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అదే స్థాయిలో కిందకు విడిచిపెడుతున్నారు.
నిండుకుండలా…
సాగర్ నిండుకుండలా కనిపిస్తోంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 589.4 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 310.25 టీఎంసీలకు చేరుకుంది.