తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు సద్దుల బతుకమ్మ కావడంతో ప్రభుత్వం అధికారికంగా ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ సంబురాలు ఏర్పాటు చేసింది. ఈసారి డీజేల ఏర్పాటుకు బదులు సొంతంగా పాటలు పాడేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో ఓవైపు కళాకారులు, మహిళల బతుకమ్మ ఆటపాటలతో ట్యాంక్ బండ్ కన్నుల పండువగా కనిపిస్తోంది. ఇక ఇవాళ చివరి రోజు కావడంతో మంత్రి సీతక్క కూడా బతుకమ్మను తలపై పెట్టుకుని ట్యాంక్ బండ్ వద్దకు వెళ్లారు.
వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ తదితర జిల్లా కేంద్రాల్లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగుతున్నాయి. కొందరు రాజకీయ నేతలు కూడా ఈ సంబురాల్లో పాల్గొని ఆటపాటలతో అలరించారు.