Saturday, November 23, 2024

ప్లాస్మా డొనేట్ చేస్తున్నా: సచిన్ టెండూల్కర్

కరోనా మహ్మమారి కోరల నుంచి బయటపడిన టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చారు. గత నెల 27న సచిన్‌కు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరిన సచిన్ ఈ నెల 8న డిశ్చార్జ్ అయ్యాడు. కరోనా వైరస్‌ బారినపడిన తాను పూర్తిగా కోలుకున్నట్టు టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ట్వీట్‌ చేశాడు. కొవిడ్‌ నుంచి కోలుకొన్నాక 14 రోజుల్లోపు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకపోతే ప్లాస్మా దానం చేయేచ్చు. కాగా, శనివారం 48వ పుట్టినరోజు జరుపుకొన్న సచిన్‌కు సెలెబ్రిటీలతో పాటు అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా విషెస్‌ తెలిపారు. తాను మొత్తం 21 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపిన సచిన్.. కరోనా రోగుల కోసం త్వరలో ప్లాస్మాను దానం చేయనున్నట్టు తెలిపాడు. కాగా, వైరస్ నుండి కోలుకున్నాక 14 రోజుల్లోపు ఎలాంటి లక్షణాలు లేకుంటే ప్లాస్మాను దానం చేయవచ్చు.  స‌రైన స‌మ‌యంలో ప్లాస్మా ఇస్తే కొవిడ్ పేషెంట్లు కోలుకుంటార‌ని డాక్ట‌ర్లు చెప్పార‌ని, ఇదే సందేశాన్ని అంద‌రికీ ఇవ్వాల్సిందిగా వాళ్లు చెప్పిన‌ట్లు మాస్ట‌ర్ తెలిపాడు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement