హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చెరువులు, పార్కులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజేన్సీ(హైడ్రా)ని ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు కమిషనర్‌గా ఉన్న ఏవీ రంగనాథ్.. హైదరాబాద్‌లో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలపై బుల్డోజర్లు ప్రయోగిస్తున్నారు. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా.. ఎలాంటి బెదిరిపులకు లొంగకుండా.. అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది.
కాగా, హైడ్రా కమిషనర్ రంగానాథ్‌పై మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘శభాష్ రంగనాథ్.. మంచి పని చేస్తున్నారు”అంటూ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు… రంగనాథ్‌కు ప్రోత్సాహం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచన చేయటమే కాకుండా.. ఈ హైడ్రాను కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం చేయకుండా రాష్ట్రమంతా విస్తరించాలంటూ సలహా కూడా ఇచ్చారు ఆకునూరి మురళి.