భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఆఖరి టీ20 పోరులో టీమిండియా విశ్వరూపం చూపుతోంది. తొలుత బ్యాట్‌తో చెలరేగిన భారత్.. ఇప్పుడు బంతితో సఫారీలను చిత్తు చేస్తోంది. 284 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో మూడో బంతికి ఓపెనర్ రీజా హెండ్రిక్స్ ఔట్ కావడంతో దక్షిణాఫ్రికా జట్టు తొలి వికెట్ కోల్పోయింది.
అనంతరం రెండో ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన ఐదో బంతికి రియాన్ రికెల్టన్ (1) పెవిలియన్ చేరాడు. మూడో ఓవర్లో మళ్లీ బౌలింగ్ చేసిన అర్షదీప్.. ఐదో, ఆరో బంతుల్లో కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (8), విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ లను పెవిలియన్ చేర్చాడు. దీంతో సఫారీ జట్టు మూడు ఓవర్లలో 10 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.