Friday, November 22, 2024

అక్టోబర్‌ 5 నుంచి ఎస్‌ఏ-1 పరీక్షలు.. 8, 9, 10 తరగతులకు ఏడు పేపర్లతో పరీక్షలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు నిర్వహించే ఎస్‌ఏ (సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌)-1 పరీక్షలు అక్టోబర్‌ 5 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించాలని ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ రాధా రెడ్డి తెలిపారు. ఈమేరకు శనివారం నాడు ఆమె ఉత్తర్వులు జారీ చేశారు.

ఒకటి నుంచి ఐదోతరగతి వారికి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 6, 7, తరగతులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు, ఎనిమిదో తరగతికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు నిర్వహించనున్నారు. ఇక 9, 10 తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్‌ఏ-1 పరీక్షలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లా విధ్యాధికారులకు ఆదేశాలను జారీ చేశారు.

ఇదిలా ఉంటే 8, 9, 10 తరగతి విద్యార్థులకు మొత్తం ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. భౌతికశాస్త్రం, జీవశాస్త్రాలను రెండు పేపర్లుగా విభజించి ఒకేరోజు ఆ రెండు పేపర్లకు పరీక్ష నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement