ప్రపంచ నం.4 ఎలెనా రైబాకినా ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ నుంచి తప్పుకుంది. ఎగువ శ్వాసకోశ అనారోగ్యం కారణంగా రోలాండ్ గారోస్ నుండి శనివారం వైదొలిగింది. ప్రస్తుత వింబుల్డన్ ఛాంపియన్ స్పెయిన్‌కు చెందిన సారా సోరిబ్స్ టోర్మోతో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్ ప్రారంభానికి ముందే ఆమె ఈ ప్రకటన చేసింది. రెండవ రౌండ్ మ్యాచ్ తర్వాత అనారోగ్యంగా ఫీలవుతున్నట్లు మీడియాతో చెప్పిన ఆమె, తాజా నిర్ణయం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేసింది.
”నేను డాక్టర్‌ని కలిశాను. తాను వైరస్ బారినపడినట్లు చెప్పారు. అలెర్జీ కారణంగా రోగనిరోధక శక్తి తగ్గిపోయింది. నాకు రెండు రోజులు సరిగా నిద్ర లేదు. జ్వరం, తలనొప్పి, గొంతులో అస్వస్థతతో బాధపడుతున్నాను. కాబట్టి, ఆడటం కష్టంగా అనిపిస్తుంది. పరిగెత్తడం, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది. అందుకే టోర్నీ నుంచి వైదొలగాలని కఠిన నిర్ణయం తీసుకున్నాను” అని రైబాకినా వెల్లడించారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు ఆమె రెండు డబ్ల్యుటిఎ 1000 ఈవెంట్‌లలో ఛాంపియన్‌గా నిలిచింది. రెండు వారాల క్రితం రోమ్‌లోని క్లేపై ఇటీవల జరిగిన మ్యాచ్‌తో సహా, రైబాకినా 2021లో క్వార్టర్‌ఫైనలిస్ట్‌గా నిలిచిన పారిస్‌లో తన జోరును కొనసాగించడానికి ప్రయత్నించింది. టోర్నమెంట్‌లో రెండు రౌండ్లలో నెగ్గింది. బ్రెండా ఫ్రు#హ్వర్టోవా, లిండా నోస్కోవాలను ఓడించింది.