Saturday, November 23, 2024

బలం తగ్గిన రష్యా.. యుద్ద విమానాలతో ఉక్రెయిన్‌ ముందడుగు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్దాన్ని ప్రకటించిన నేపథ్యంలో .. పాశ్చాత్య దేశాల నుంచి కఠిన ఆంక్షలను రష్యా ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ పై దాడులకు దిగిన రష్యా ప్రస్తుతం కిరాయి సైనికులను సైతం రంగంలో దింపినట్లు బ్రిటన్‌ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో రష్యా సైన్యం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత వరకు ప్రయివేటు మిలటరీ కంపెనీ వాగ్నెర్‌ గ్రూపు నుంచి పేయిగ్‌ ఫైటర్స్‌ని దింపింది. ఇప్పుడు మరింత ముందుకడుగు వేసి యుద్ద కాంక్షతో ఆఖరికి కిరాయి సైన్యాన్ని దింపేందుకు రెడీ అయ్యింది. ఒక రకంగా రష్యా సైన్యం కూడా కాస్త ఒత్తిడికి గురవుతోందని అవగతమవుతోంది. ఏది ఏమైనా రష్యా ఈ కిరాయి సైనికులతో పదాతిదళ సామర్ధ్యాన్ని పూరించడం అసాధ్యం అని బ్రిటన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉక్రెయిన్‌ అధికారులు దక్షిణ ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు భారీగా పునరాగమించినట్లు తెలిపారు.

అదీగాక డినిప్రో నదికి పశ్చిమలో రష్యా సైన్యం తీవ్ర నష్టం కలిగించనుందని బ్రిటీష్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రష్యా అనుకూల వేర్వేరు ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ సైన్యం తీవ్రంగా ప్రతిఘటించడమే కాకుండా రష్యా సైన్యం చొరబడకుండా అడ్డుకుంది. రష్యా సైన్యం ప్రవేశించకుండా అక్కడ ఉన్న డినిప్రో నదిపై ఉన్న మూడు వంతెనలను ధ్వంసం చేసింది. అంతే కాదు ఉక్రెయిన్‌ తన యుద్ద విమానాలతో ఖేర్సన్‌ చుట్టూ ఉన్న ఐదు ర ష్యన్‌ బలమైన ప్రాంతాలతో పాటు సమీపంలోని మరొక నగరంపై దాడి కూడా చేసిందని బ్రిటన్‌ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రష్యా కిరాయి సైనికులను యుద్దంలో దింపడమే కాకుండా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ శివార్లలోని సైనిక స్థావరాలపై కూడా బాంబు దాడి చేసినట్లు పేర్కొంది. ఈ దాడి కారణంగా సుమారు 15 మంది గాయపడ్డారని ఉక్రెయిన్‌ ప్రాంతీయ గవర్నర్‌ ఒలెక్సీ కులేబా వెల్లడించారు.

తన గోతిలో తానే…
ఉక్రెయిన్‌పై దాడులు చేస్తూ భూభాగాన్ని ఆక్రమించుకుంటున్న రష్యాకు శుక్రవారం తీపి కబురు అందింది. ఉక్రెయిన్‌ తయారు చేసుకున్న బాంబు దాడి వల్లే 40 మంది చనిపోయారు. రష్యా మద్దతుగల వేర్పాటు వాద నేత డానిల్‌ శుక్ర వారం ఓ ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌పై భీకరదాడులు చేస్తూండగానే ఉక్రెయిన్‌ తయారు చేసుకున్నబాంబు పొరపాటున పేలిపోయింది. దీంతో ఉక్రెయిన్‌ సైనికులు మరణించారు. ఉక్రెయిన్‌లో యుద్ద సంక్షోభం కొనసాగుతున్న వేళ.. ఆ దేశంలోని రెండో అతిపెద్ద పవర్‌ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement