రష్యా జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన కర్నాటక వైద్య విద్యార్థి విషయాన్ని ఆ దేశం సీరియస్‌గా తీసుకుంది. మోడీ కూడా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లాడటంతో.. భారతీయ విద్యార్థుల భద్రత విషయంలో రష్యా దిగొచ్చింది. భారతీయులను స్వదేశానికి తరలించేందుకు తన వంతు సహకారం అందిస్తోంది. భారతీయులను ఉక్రెయిన్ నుంచి క్షేమంగా తీసుకొచ్చేందుకు రష్యా ప్రత్యేక బస్సులను రంగంలోకి దించింది. రష్యా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల నుంచి తరలించేందుకు 130 బస్సులను సిద్ధం చేసింది. అటు ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్, సూమీలకు కూడా బస్సులను పంపేందుకు నిర్ణయించింది. మరోవైపు ఇప్పటికే పోలాండ్‌కు వచ్చి ఉన్న విద్యార్థులను… అక్కడే ఉంచాలన్న ఆలోచనకు ఇండియా వచ్చినట్టు తెలుస్తున్నది.
పోలాండ్ సేఫ్ ప్లేస్..!
కొద్ది రోజులు విద్యార్థులను పోలాండ్‌లో ఉంచి.. పరిస్థితుల తీవ్రత ఆధారంగా చర్యలు తీసుకునేందుకు భారత్ నిర్ణయించినట్టు సమాచారం. రష్యాకు చేరుకున్న వారి పట్ల కొంత ఆలస్యం చేసినా ప్రమాదం లేదనే ఆలోచనలో మోడీ ప్రభుతం ఉన్నట్టు తెలుస్తోంది. ముందుగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారిని భారత్‌కు తరలించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నది. భారతీయులను సదేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు ఇండియా.. ప్రత్యేక నేవీ విమానాలను రంగంలోకి దించింది. శుక్రవారం ఉదయం.. మరో 219 మంది భారత్‌కు చేరుకున్నారు. వీరందరికీ కేంద్ర మంత్రి కైలాష్ చౌదరీ స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌లో వైద్య విద్యనభ్యసించడానికి 24వేల మంది భారతీయులు వెళ్లినట్టు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు4,500 మంది వరకు ఇండియాకు వచ్చారు. మరో 19వేల మంది ఉక్రెయిన్‌లోనే ఇరుక్కుపోయినట్టు తెలుస్తున్నది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..