Friday, November 22, 2024

చైనా సాయం కోరలేదు, అమెరికా మీడియా కథనాలపై రష్యా స్పందన

ఉక్రెయిన్‌లో తన లక్ష్యాలన్నింటినీ నిర్ణీతకాలంలో పూర్తిచేసేందుకు రష్యాకు తగినంత సైనికబలం ఉందని క్రెవ్లిున్‌ ప్రతినిధి డిమిత్ర పెస్కోవ్‌ చెప్పారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి సైనిక, ఆర్థిక సహాయం కోసం తాము చైనాను అభ్యర్థించినట్లు వచ్చిన అమెరికా మీడియా కథనాలను క్రెవ్లిుంగ్‌ తోసిపుచ్చింది. సైనిక సామగ్రికోసం అభ్యర్థన కొత్తదేమీకాదని స్పష్టంచేసింది. అయితే ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభించిన వెంటనే పరికరాల సరఫరా కోరినట్లు అమెరికా తెలిపింది. దీనిపై చైనా విదేశాంగ ప్రతినిధి మాట్లాడుతూ, ఉక్రెయిన్‌ సమస్యపై చైనాను లక్ష్యంగా చేసుకుని అమెరికా దురుద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తిచేస్తోంది అని అన్నారు. కాగా, ఇరుదేశాల మధ్య ఘర్షణలను ముగించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరొకవైపు పాశ్చాత్య అనుకూల పొరుగున ఉన్న ఉక్రెయిన్‌లోని ప్రధాన పట్టణాలవైపు మాస్కో సేనలు క్రమంగా పురోగమిస్తోంది. పెద్ద నగరాలపై నియంత్రణ పెంచుకుంటామని క్రెమ్లిన్‌ సోమవారం తెలిపింది. పెద్దనగరాలపై తక్షణ దాడిని ఆపాలని పుతిన్‌ ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే అక్కడ పౌర నష్టాలు ఎక్కువగా ఉంటాయి అని క్రెవ్లిున్‌ ప్రతినిధి డిమిత్ర పెస్కోవ్‌ విలేకరులతో చెప్పారు. అయినప్పటికీ రష్యా రక్షణమంత్రిత్వ శాఖ ఇప్పటికే దాదాపుగా చుట్టుముట్టబడిన పెద్ద నగరాలను తన పూర్తి నియంత్రణలో ఉంచే అవకాశాన్ని తోసిపుచ్చలేదు అని ఆయన అన్నారు. మానవతా కారిడార్‌ ప్రాంతాలకు మినహాయింపులు ఉంటాయని తెలిపారు.

పశ్చిమ దేశాల ఆస్తులు స్వాధీనం నిజంకాదు..

పశ్చిమ దేశాల కంపెనీల ఆస్తులు స్వాధీనం చేసుకోబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని రష్యా కొట్టిపారేసింది. అమెరికాలోని రష్యా రాయబార కార్యాలయం దీనిపై ప్రకటన చేసింది. ఇవి పూర్తిగా అభూత కల్పన. రష్యాలో ఉన్న అమెరికా సంస్థల ఆస్తులను జాతీయం చేస్తారనే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం పూర్తిగా అబద్దం. తప్పుడు వార్తలను ప్రచారంలోకి తెచ్చే అలవాటు మానుకోవాలి. మా దేశంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వ#హంచాలా వద్దా అన్నది పూర్తిగా అమెరికా కంపెనీల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. రష్యా భయాలను వీడాలని కోరుతున్నాము. ఇటువంటి భయాలు కంపెనీలకు భారీ నష్టాలను మిగులుస్తాయి అని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement