ఉక్రెయిన్‌పై తక్షణమే దాడులు నిలిపివేయాలంటూ అంతర్జాతీయ కోర్టు (ఐసీజే) ఆదేశాలను రష్యా తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని తాము పరిగణనలోకి తీసుకోలేమని క్రెవ్లిున్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఈ తీర్పును అమలు చేసేందుకు రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలూ పరస్పరం అంగీకరించాల్సి ఉంటుందన్నారు.
ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు రష్యా చెబుతోంది. ఇందుకోసం తమ ప్రతినిధి బృందం ముమ్మర ప్రయత్నాలు చేస్తోందన్నారు. తమ ఒప్పందాలకు అంగీకరిస్తే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు తెరపడుతుందని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..