Thursday, November 7, 2024

ఉక్రెయిన్‌ రైల్వే స్టేషన్‌పై రష్యా రాకెట్‌ దాడి.. క్రమటోర్స్క్ లో ఘటన

ఉక్రెయిన్‌లోని తూర్పు భాగంపై రష్యా ఒక్కసారిగా రాకెట్లతో విరుచుకుపడింది. క్రమటోర్స్క్‌ నగరంలోని ఓ రైల్వే స్టేషన్‌పై రష్యా జరిపిన రాకెట్ల దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. క్రమటోర్స్క్‌ రైల్వే స్టేషన్‌ను రెండు రష్యా రాకెట్లు పేల్చేశాయి. ఈ ఘటనలో 50 మందికి పైగా మరణించినట్టు ప్రభుత్వ రైల్వే కంపెనీ వెల్లడించింది. కానీ సహాయక చర్యలు ప్రారంభించిన తరువాత.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వివరించింది. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. క్రమటోర్స్క్‌ రైల్వే స్టేషన్‌ను రెండు రాకెట్లు పేల్చేశాయని ఉక్రెయినియన్‌ రైలేస్‌ వెల్లడించింది. ఆపరేషనల్‌ డేటా ప్రకారం.. 30 మందికి పైగా ఘటనా స్థలంలోనే చనిపోయినట్టు తెలిపింది. రాకెట్లు దాడి చేసే సమయంలో రైలే స్టేషన్‌లో వేలాది మంది ప్రయాణికులు ఉన్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా దొనెత్క్క్‌ రీజియన్‌ గవర్నర్‌ పావ్‌లో కిరిలెంకో మాట్లాడుతూ.. ఈ ఘటనపై రష్యా ఇంకా స్పందించాల్సి ఉందని తెలిపారు. సాధారణ పౌరులకు హానీ తలపెట్టబోమని రష్యా అప్పుడే ప్రకటించిందని, తమ లక్ష్యం కేవలం ఉక్రెయిన్‌లోని మిలిటరీ స్థావరాలే అని చెప్పిందని గుర్తు చేసింది.
రష్యా హద్దుల్లేని రాక్షసి
అమాయక పౌరులే లక్ష్యంగా రష్యా ఆర్మీ క్షిపణి, రాకెట్‌ దాడులకు పాల్పడుతున్నదని ఉక్రెయిన్‌ చెప్పుకొచ్చింది. రాకెట్‌ దాడి తరువాత.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తీవ్రంగా స్పందించారు. రష్యా హద్దులు లేని రాక్షసిగా అభివర్ణించాడు. నాగరికి ప్రజలను రాక్షస రష్యా చంపేస్తున్నదని సోషల్‌ మీడియాలో ఆయన పేర్కొన్నారు. ఏ ఏరియాలో రష్యా దాడులు పెరిగే అవకాశం ఉన్నదన్న సంకేతాలు మధ్య చాలా మంది అక్కడి నుంచి తరలివెళ్లిపోతున్నారని అన్నారు. అయితే ఆ తరలింపులు ప్రధానంగా రైల్వే స్టేషన్ల గుండా జరుగుతున్నాయని వివరించారు. ప్రస్తుతం రష్యా దాడి చేసిన రైల్వే స్టేషన్‌ కూడా ఉక్రెయిన్‌ పౌరుల తరలింపు కోసమే అని తెలిపారు. ఈ తరలింపు ప్రక్రియ జరుగుతున్న రైల్వే స్టేషన్‌పైనే రష్యా రెండు రాకెట్లతో దాడి చేయడం అమానుషం అన్నారు. దోన్‌బాస్‌ రీజియన్‌ రష్యా దాడుల నుంచి తప్పించుకోవడానికి చివరి అవకాశం ఇదేనని పేర్కొంటూ చాలా మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిపోతున్నారని వివరించారు. రష్యా గతంలో ఉక్రెయిన్‌లోని క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement