కీవ్: ఉక్రెయిన్ పోర్ట్ నగరం ఒడిసాపై రష్యా మిస్సైల్ దాడి చేసింది. బిల్డింగ్‌పై జరిగిన అటాక్‌లో 18 మంది మృతి చెందారు. దీంట్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నల్ల సముద్రంలోని స్నేక్ ఐలాండ్ నుంచి తమ బలగాలు ఉపసం హరించినట్లు రష్యా ప్రకటన చేసిన మరుసటి రోజు ఈ ఘటన జరగడం గమనార్హం. సెర్హివికా గ్రామంలో ఉన్న బిల్డింగ్‌పై తెల్లవారు జామున దాడి జరిగింది. ఒడిసాకు ఇది 50 కిలో మీటర్ల దూరంలో ఉంది. బహుళ అంతస్తు భవనాన్ని మిస్సైల్ తాకి ఉంటుందని ఉక్రెయిన్ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఘటన మరో 30 మంది గాయపడి ఉంటారని అధికారులు చెబుతున్నారు.
ఆధీనంలోకి స్నేక్ ఐలాండ్..
వ్యూహాత్మకంగా కీలకమైన స్నేక్ ఐలాండ్ నుంచి తమ దళాలను ఉపసంహరించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ , రష్యా యుద్దం ఆరంభంలో ఈ ద్వీపం కీలకంగా నిలిచింది. ఉక్రెయిన్ దళాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. రష్యా దళాలు ఐ ల్యాండ్ నుంచి వెనక్కి వెళ్లినట్టు ఉక్రెయిన్ చెప్పింది. నల్ల సముద్రంలో ఉన్న స్నేక్ ల్యాండ్ .. రష్యా, ఉక్రెయిన్ వార్‌లో కీలకంగా మారింది. గతంలో రష్యా ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతంన్ని ఇప్పుడు స్వాధీనం చేసుకున్నది. ఈ దీవిని ఆక్రమించిన వారు ఒక వేళ అక్కడ లాంగ్ రేంజ్ మిస్సైల్ వ్యవస్థను ఏర్పాట్లు చేస్తే అప్పుడు వాళ్లకు ఈ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించినట్లు అవుతుంది. అయితే రష్యాకు ఆ అవకాశం ఉన్నా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసింది. గతంలో రొమేనియా ఆధీనంలో ఉన్న స్నేక్ ఐలాండ్‌ను సోవియట్ యూనియన్ సమయంలో రాడార్ బేస్‌గా వాడారు. స్నేక్ ఐల్యాండ్ నుంచి దళాలను ఉపసంహరించడం అంటే తాము ఆహార ఎగుమతుల్ని అడ్డుకోవడం లేదని స్పష్టం చేసినట్లు అవుతుందని రష్యా చెప్పింది. ఇదొక రకంగా ఉక్రెయిన్ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల్ని తరలించేందుకు ఐక్య రాజ్య సమితి చేస్తున్న ప్రయత్నాలకు అడ్డు తగలడం లేదని రష్యా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆహార సంక్షోభానికి తామే కారణమని చెప్పడానికి ఇప్పుడు ఉక్రెయిన్ వద్ద సమాధానం ఉందని రష్యా తెలిపింది. ఉక్రెయిన్ మాత్రం ఇంకా నల్ల సముద్రంలోని తీర ప్రాంతాన్ని క్లియర్ చేయడం లేదని రష్యా ఆరోపిస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.