ఉక్రెయిన్‌లోని హోస్టోమెల్ విమానాశ్రయంలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఆంటోనోవ్ యాన్-225 విమానాన్ని రష్యన్ బలగాలు ధంసం చేశాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఉక్రెయిన్ మీడియా విడుదల చేసింది. ఉక్రెయిన్ సైన్యం చేతిలో.. 9,166 మంది రష్యన్ సైనికులు హతమైనట్టు తెలిపింది. 33 విమానాలు, 37 హెలికాప్టర్లు, 2 బోట్లు, 60 ఇంధన ట్యాంకులు, 404 కార్లు, 251 యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత శాఖ ప్రకటించింది. అయితే ఉక్రెయిన్ బలగాల చేతిలో ఇంతకంటే ఎక్కువ మందే చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నామని తెలిపింది. కీవ్‌పై పట్టు సాధించేందుకు రష్యన్ ఆర్మీ ప్రయత్నిస్తూనే ఉందని, తమ బలగాలు ధీటుగా బదులిస్తున్నాయని వివరించింది.
కీవ్‌లోని చాలా ప్రాంతం తమ ఆధీనంలోనే ఉందని, శాయశక్తులా పోరాడుతామని వివరించింది. మరిన్ని బలగాలను కీవ్ సరిహద్దుకు తరలిస్తున్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. రష్యన్ పంత్సీర్ ఎస్-1 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఉక్రేనియన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయని, దీన్ని నిర్వహించడానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు. రష్యన్ సుఖోయ్ 25 యుద్ధ విమానాన్ని వొల్వోనోహకా సమీపంలో ఉక్రెయిన్ బలగాలు పేల్చేశాయని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..