తూర్పు ఉక్రెయిన్లో పూర్తి పట్టు సాధించే దిశగా రష్యా దాడులు ముమ్మరం చేసింది. క్షిపణులు, రాకెట్లు, బాంబులతో విరుచుకుపడుతోంది. లుషాంక్ రీజియన్లో అతిపెద్ద పట్టణం సీవీరోడోనెట్స్క్లో భీకరపోరు సాగుతోంది. వైమానిక దాడులతో బెంబేలెత్తిస్తోంది. సీవీరోడోనెట్స్క్లోని ఎత్తయిన ప్రాంతాలపై మోహరించిన రష్యా దళాలు దిగువనున్న లిసిచాన్స్క్ వంటి ప్రాంతాలపై దాడులు చేస్తోంది. అక్కడి ఒక మైనింగ్ కళాశాల బాంబుల ధాటికి నేలమట్టమైంది. ఈ దాడల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని లుషాంక్ ప్రాంతీయ సైనికాధికారి హెడే తెలిపారు. లిసిచాన్స్క్ పట్టణానికి సమీపంలోని బిలోహోరివ్కా గ్రామంపైనా విరుచుకుపడింది. కాగా ఉక్రెయిన్ దాడుల్లో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారని లుషాంక్ వేర్పాటువాద ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ఆరోపించారు. సీవీరోడోనెట్స్క్లో దాదాపు వీధిపోరాటం సాగుతోంది.
ఇరుపక్షాల హోరాహోరా తలపడుతున్నాయి. నగరంలో 80 శాతం ఇప్పటికే రష్యా స్వాధీనం చేసుకుంది. మిగతా ప్రాంతంపై పట్టుకోసం రష్యా సేనలు ప్రయత్నిస్తుండగా ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. మరోవైపు దక్షణ ఉక్రెయిన్లోని జపోరిరి&ురి&ుయాలోనూ పోరాటం తీవ్రంగా సాగుతోంది. ఖేర్సన్ ప్రాంతంలో రష్యా ఎదురుదాడులకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఉత్తర ప్రాంతంలోని సుమీలో సెరెడైనా-బుడా పట్టణాలపై మంగళవారం ఉదయాన్నే రష్యా ఫిరంగి దళంతో దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో పెద్దసంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.