Tuesday, November 19, 2024

Russia Tour – జ‌స్ట్ అయిదేళ్లు … ప్ర‌పంచంలోనే పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్ – ప్రధాని మోదీ

ర‌ష్యాలో ప‌ర్య‌టిస్తున్న ప్ర‌ధాని మోదీ
అక్క‌డి ఎన్ ఆర్ ఐ ల‌తో స‌మావేశం
ప్ర‌పంచంలోనే మూడో ఆర్ధిక వ్య‌వ‌స్థ తీర్చి దిద్దుతాం
ఆ ప‌దేళ్ల‌లో ఎన్నో విజ‌యాలు సాధించాం

మాస్కో: రాబోయే ఈ ఐదేళ్ల పదవీకాలంలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారుస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఇటీవలే మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశానని, మూడు రెట్ల వేగంతో పని చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. రష్యా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాని నేడు రాజధాని మాస్కోలో ప్రవాస భారతీయుల ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇక్కడికి తాను ఒక్కడినే రాలేదని, 140 కోట్ల మంది ప్రేమను వెంట తీసుకొని వచ్చానని వ్యాఖ్యానించారు. అలాగే భారత్ సాధించిన విజయాలను ప్రపంచం గుర్తిస్తోంద‌న్నారు.. భారత్‌ జీ-20 సదస్సును విజయవంతంగా నిర్వహించిందని.. డిజిటల్‌ పేమెంట్లలో సరికొత్త రికార్డ్‌లను సృష్టించామన్నారు. దేశం మారుతోందని ప్రపంచం మొత్తం మ‌న‌దేశాన్ని గుర్తిస్తోందన్నారు.

- Advertisement -

పదేళ్లలో ఆశ్చర్యపోయేంత అభివృద్ధి

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జీని నిర్మించాం.. పదేళ్లలో ముఫ్పై వేల కిలోమీటర్ల రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్లు చేశాం .. పదేళ్లలో ఎయిర్‌ పోర్ట్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తామని ప్రకటించారు. గత పదేళ్లలో జరిగిన అభివృద్ది ట్రైలర్‌ మాత్రమే .. అసలు అభివృద్ధి ముందు ముందు ఉంటుందన్నారు. దేశాభివృద్దిలో 140 కోట్ల భారతీయుల కృషి ఉందని.. సవాలు..సవాళ్లు నా డీఎన్‌ఏలో ఉన్నాయి. గత పదేళ్లలో దేశంలో జరిగిన అభివృద్దిపై ప్రపంచమే ఆశ్చర్యపోయిందని గుర్తు చేశారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్‌ 15 శాతం సహకరిస్తోందన్న మోదీ.. 2014కి ముందు అంధకారంలో ఉందన్నారు.

టీ20 ప్రపంచకప్‌ విజయ రహస్యం అదే..

”ఇటీవల టీమ్‌ఇండియా టీ20 వరల్డ్ కప్‌ గెలిచిన సందర్భాన్ని మీరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని ఉంటారు. గెలుపు కోసం వారు పడిన ఆరాటం.. అందుకు సాగించిన ప్రయాణమే వారి విజయం వెనుక ఉన్న అసలు కథ. ఈ రోజుల్లో యువత చివరి క్షణం (చివరి బంతి) వరకు ఓటమిని అంగీకరించడం లేదు. అలా ముందుకుసాగే వారినే విజయం వరిస్తుంది” అని రోహిత్‌ సేనను ప్రధాని కొనియాడారు. అలాగే మన ఇరు దేశాల సంబంధాలు బలోపేతం కావడంతో సినిమాలది కీలక పాత్ర అని చెప్పారు. ఈ సందర్భంగా అలనాటి ప్రముఖ నటులు రాజ్‌కపూర్‌, మిథున్‌ చక్రవర్తి ప్రస్తావన తీసుకొచ్చారు. వారి సినిమాలు రష్యాలో ప్రజాదరణ పొందాయని చెప్పారు.

పుతిన్‌కు కృతజ్ఞతలు..

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వేళ.. భారత విద్యార్థులు చిక్కుకుపోతే, వారిని కాపాడటంలో పుతిన్ సహకరించారని మోదీ గుర్తుచేశారు. ఈసందర్భంగా ఆయనతో పాటు రష్యా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ”భారత్-రష్యా నమ్మకమైన మిత్రులు. పరస్పర విశ్వాసం, గౌరవం ఆధారంగా ఈ స్నేహం కొనసాగుతోంది. రష్యాలో చలికాలంలో ఉష్ణోగ్రతలు ఎంత మైనస్‌లోకి పడిపోయినా సరే.. మన రెండు దేశాల మధ్య బంధం ఎప్పుడూ ప్లస్‌లోనే ఉంటుంది. అది మన స్నేహాన్ని ఆహ్లాదంగా ఉంచుతుంది. ఇప్పటివరకు నేను ఆరుసార్లు రష్యాలో పర్యటించాను. పుతిన్‌తో 17 సార్లు భేటీ అయ్యాను” అని తెలిపారు.

ప్రతి భారతీయుడు దేశాన్ని మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. భారతదేశ విజయాల గురించి ఎన్నారైలు గర్వంగా మాట్లాడుతున్నారని.. ఈ రోజు భారత్‌ చంద్రుని భాగంలోకి చంద్రయాన్‌ పంపింది. మరే ఇతర దేశం ఆ స్థాయికి చేరుకోలేదని గుర్తు చేశారు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ను భారత్‌ కలిగి ఉందన్నారు. భారత్‌ను మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే త‌మ‌ లక్ష్యమని ప్రకటించారు.

రష్యాతో కీలక ఒప్పందాలు చేసుకోనున్న మోదీ

ప్రధానిగా మూడో సారి బాధ్యతలు చేపట్టిన మోదీ తొలిసారి రష్యాలో పర్యటిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య పలు అంశాలపై చర్చలు జరగనున్నారు, ఫైటర్ జెట్ SU-57పై ఒప్పందం. భారతదేశంలో యాంటీ ట్యాంక్ షెల్స్‌ను తయారీ పరిశ్రమకు సంబంధించి ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement