తమపై యుద్ధానికి దిగిన రష్యా, ఓటమి తప్పదని గుర్తించిందని, ఆ నైరాశ్యంలోనే ప్రపంచ దేశాలను బెదరగొట్టేందుకు అణ్వాయుధాలు ప్రయోగిస్తామని, మూడో ప్రపంచ యుద్ధం తప్పదని బెదరిస్తోందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా పేర్కొన్నారు. రష్యా విదేశాంగ మంత్రి లవ్‌రోవ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ దిమిత్ర ట్విట్టర్‌లో కీలక అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. రష్యా తాజా బెదరింపుల నేపథ్యంలో ఉక్రెయిన్‌సహా యూరోపియన్ దేశాలను, ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచేందుకు ప్రపంచ దేశాలు మరింత సాయం చేయాలని కోరారు.
కాగా లవ్‌రోవ్ హెచ్చరికలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సలహాదారు మైఖాయిలో పొడొల్యాక్ కొట్టిపారేశారు. మరోవైపు రష్యా అణుహెచ్చరికలను ప్రపంచ దేశాలు తేలిగ్గా తీసుకున్నాయి. అణుయుద్ధం వచ్చే అవకాశాలు చాలా తక్కువని అభిప్రాయపడ్డాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..