ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌తో తాము చర్చలకు సిద్ధమని క్రెవ్లిున్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ప్రకటించారు. బెలారస్ దేశంలో ఉక్రెయిన్ తరఫు నుంచి ఎవరు వచ్చినా.. తాము శాంతి చర్చలు జరుపుతామని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు ముందు నుంచే ఆ ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రపంచ దేశాల నుంచి పుతిన్‌పై ఒత్తిడి పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో.. బెలారస్ వేదికగా చర్చలకు సిద్ధమని రష్యా ప్రకటించినట్టు తెలుస్తున్నది. సైనిక చర్య ప్రారంభానికి ముందు నుంచి చర్చలకు తాము సిద్ధమే అని ప్రకటించినా.. ఉక్రెయిన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పుకొచ్చారు. చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారని విమర్శించారు. ఇది ఉక్రెయిన్ యుద్ధం కాదని.. కేవలం సైనిక చర్యే అని రష్య తెలిపింది.
బృందంలో విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖ..
తమ మిత్ర దేశమైన బెలారస్ వేదికగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బెలారస్‌లోని గోమెల్లో చర్చించుకుందామని, ఉక్రెయిన్ నుంచి ఎవరు వచ్చినా.. ఎంత మంది వచ్చినా.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు రష్యా ప్రతినిధి బృందం బెలారస్ కూడా వెళ్లినట్టు క్రెవ్లిున్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ప్రకటించారు. ఈ బృందంలో రష్యా విదేశాంగ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కార్యాలయం అధికారులు ఉన్నట్టు తెలుస్తున్నది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఫిబ్రవరి 24న ప్రారంభమైన తరువాత.. చర్చలకు సిద్ధమవడం ఇదే తొలిసారి. రష్యన్ బృందం బెలారస్‌లోని గోమెల్‌కు చేరుకుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..