ఉక్రెయిన్‌ను రష్యా బలగాలు ఊపిరాడకుండా చేస్తున్నాయి. క్షిపణులు, తుపాకులు, బాంబులతో కీవ్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న రష్యా.. కీలక దాడి చేసేందుకు పథక రచన చేస్తున్నట్టు సమాచారం. తొలుత నివాస ప్రాంతాలు, ఉక్రెయిన్ ఆయుధాగారాలు, ఆర్మీ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఆ తరువాత ప్రభుత్వ అధికారులు పనులు చక్కబెట్టే ప్రాంతాలను లక్ష్యంగా దాడులు చేపట్టింది. అయితే ఈసారి అధ్యక్ష భవనాన్నే లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను సొంతం చేసుకున్న రష్యా బలగాలు.. అధ్యక్ష భవనంపై దాడులకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తున్నది. ఇది పసిగట్టిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తున్నది. అధ్యక్ష భవనం దాడిని తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ సైన్యం కూడా రంగంలోకి దిగింది. అధ్యక్ష భవనం చుట్టూ భారీ ఎత్తున యుద్ధ ట్యాంకులు, ఆర్మీని, యాంటీ మిసైల్ వ్యవస్థను మోహరించినట్టు సమాచారం.