ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్న పోలాండ్‌పై దాడి చేసేందుకు రష్యా నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు రష్యా ఆర్మీకి సూచనలు కూడా అందినట్టు తెలుస్తున్నది. యూరోపియన్ యూనియన్‌లోని పోలాండ్‌పై రష్యా తీవ్ర ఆగ్రహంతో ఉందని, సమీప భవిష్యత్తులో దాడికి దిగే అవకాశాలు ఉన్నాయని పొలాండ్ రాజధాని వార్సాలోని కీవ్ రాయబారి ఆండ్రీ దెస్చిసియా తెలిపారు. వార్సాలోని రష్యా రాయబార కార్యాలయానికి కూడా ఈ సమాచారం ఉందని వివరించారు. అందుకు తగిన విధంగా వారు మసులుకుంటున్నారని ఆరోపించారు. వార్సాలోని రష్యా ఎంబసీపై పొగలు రావాన్ని ప్రతీ ఒక్కరు గమనించారని, అదేవిధంగా కీవ్ రాయబార కార్యాలయంపై కూడా ఇదే విధమైన పొగను గతంలో చూశామని గుర్తు చేశారు.
ఇలా ఎందుకు చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తున్నదని, పోలాండ్‌కు ఎలాంటి హాని కలిగించని సమాచారం, డాక్యుమెంటేషన్ ఉంటే.. వారు రాయబార కార్యాలయాన్ని విడిచిపెట్టాల్సి వచ్చినా.. వాటిని కాల్చేయరని వివరించారు. పోలాండ్‌లో విధ్వంసం సృష్టించేందుకు సంబంధించిన సమాచారం రష్యా రాయబార కార్యాలయం కలిగి ఉంటే.. ఇది తీవ్రమైన అంశంగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. రష్యాపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో చర్యలకు డిమాండ్ చేయవచ్చని అభిప్రాయపడ్డారు. రష్యా ఇప్పుడు ఆయుధాల వినియోగానికి సాకును సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని అభిప్రాయపడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..