ప్రపంచంలో తొలిసారి.. జంతువుల కోసం కోవిడ్ టీకాను తయారు చేయడానికి రష్యా సిద్దమవుతోంది. ప్రస్థుతం ఆ టీకాలతో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. జంతువుల కోసం కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తికి రష్యా రిజిస్టర్ చేసుకున్నది. ట్రయల్స్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని, వ్యాక్సిన్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదని, ఇమ్యూనిటీ అధిక స్థాయిలో ఉన్నట్లు గ్రహించామని అధికారులు చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న జంతువులు నూటికి నూరు శాతం కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలను డెవలప్ చేసినట్లు తెలిపారు. రష్యాకు చెందిన వ్యవసాయ సంబంధిత శాఖ రూజుల్‌కోజ్‌నడార్ ఈ టీకాలను ఉత్పత్తి చేస్తున్నది. జంతువులకు ఇచ్చే కోవిడ్ టీకాకు కార్నివాక్-కోవ్ అని పేరు పెట్టారు. గత ఏడాది అక్టోబర్‌లో ఈ టీకా ట్రయల్స్ స్టార్ట్ అయ్యాయి. కుక్కులు, పిల్లులు, నక్కలు, మింక్ జంతువులకు ఈ టీకాలు ఇవ్వవచ్చు అని రష్యా పేర్కొన్నది.
రష్యాలో జంతువులకు కోవిడ్ టీకా..
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement