ఉక్రెయిన్ సరిహద్దుల్లోని తన మిత్రదేశం బెలారస్‌కు రష్యా అణు క్షిపణులను తరలించేందుకు రంగం సిద్ధం చేసింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యాకు బెలారస్ మొదటినుంచి చేదోడువాదోడుగా ఉంటోంది. తన భూభాగాన్ని వాడుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం పశ్చిమ దేశాలనుంచి పెద్దఎత్తున ఆయుధ సహాయం అందుతూండటంతో ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తున్న నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఒకటి రెండునెలల్లో వాటిని తరలిస్తామని స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెన్‌కోతో సమావేశమైన పుతిన్ ఈ మేరకు మాటిచ్చారు. తాము పంపే క్షిపణి వ్యవస్థల ద్వారా అణ్వాయుధాలు మోసుకెళ్లగలిగే బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించవచ్చని ఆయన చెప్పినట్లు క్రెవ్లిున్ వర్గాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24న రష్యా దండయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ఉత్తర సరిహద్దుల్లో ఉన్న ఉక్రెయిన్‌పైకి రష్యా సేనలు బెలారస్ మీదుగానే వెళ్లాయి.
బెలారస్‌కు చెందిన శాటిలైట్ మిన్‌స్క్ బేస్ సహా అనేక సైనిక, వైమానిక స్థావరాలను రష్యా వాడుకుంటోంది. ఇదిలా ఉండగా కీవ్, చెర్నిహివ్, సుమీ ప్రాంతాలపై బెలారస్ కేంద్రంగా రష్యా క్షిపణులు ప్రయోగించిందని ఉక్రెయిన్ తాజాగా ఆరోపించింది. అణ్వాయుధాలను మోసుకెళ్లే క్షిపణుల ప్రయోగంపై అమెరికా,నాటో దళాలు ఉక్రెయిన్ సేనలకు తమ దేశ సరిహద్దుల్లో శిక్షణ ఇస్తున్నాయంటూ బెలారస్ అధ్యక్షుడు పుతిన్ దృష్టికి తీసుకవచ్చినపుడు ఆయన స్పందిస్తూ తాము కూడా అలాంటి క్షిపణులను పంపిస్తామని చెప్పినట్లు క్రెవ్లిున్ పేర్కొన్నట్లు చెబుతున్నారు. అయితే, అమెరికా యుద్ధ విమానాలకన్నా రష్యాకు చెందిన ఎస్‌యు 25 యుద్ధవిమానాలు శక్తివంతమైనవని పుతిన్ చెప్పినట్లు కథనం. వీటిని మరింత ఆధునికంగా మార్చి మీ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమేనని పుతిన్ మాటిచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.