Saturday, November 23, 2024

పసిఫిక్‌లో రష్యా నౌకాదళ విన్యాసాలు

మాస్కో:ఉక్రెయిన్‌పై యుద్ధంతో ప్రపంచ దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రష్యా ఇప్పుడు అమెరికా, ఐరోపా సహా అనేక దేశాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. పసిఫిక్‌ సముద్ర జలాల్లో 40 యుద్ధనౌకలతో విన్యాసాలు ప్రారంభించింది. వారంపాటు సాగే ఈ యుద్ధ విన్యాసాల్లో యుద్ధనౌకలతో పాటు 20 యుద్ధ విమానాలు పాలుపంచుకోనున్నాయి. జూన్‌ 10వ తేదీవరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సముద్ర జలాల్లో సంచరించే శత్రు జలాంతర్గాములను కనిపెట్టి ధంసం చేసే రిహార్సల్‌ను నిర్వహించనున్నారు. శత్రు లక్ష్యాలను దెబ్బతీసే విధంగా వ్యూహాత్మక దాడులపై శిక్షణ ఇవనున్నారు. ఈ విన్యాసాల్లో మార్షల్‌ షపోష్నికోవ్‌, మార్షల్‌ క్రిలోవ్‌, యాంటీ సబ్‌మెరైన్‌ నౌకలు, మిసైల్‌ బోట్లు, లాండ్‌మైన్‌లను తొలగించే యంత్రాలు, సహాయక నౌకలు పాల్గొంటాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement