గత పదిహేను రోజులకు పైగా ఉక్రెయిన్ వర్సెస్ రష్యా యుద్ధం కొనసాగుతోంది. అయితే రష్యా ఐసిస్ తీవ్రవాదులా చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. మెలిటొపోల్ మేయర్ కిడ్నాప్మెలిటొపోల్ నగరానికి చెందిన మేయర్‌ను రష్యా బలగాలు అపహరించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. రష్యన్ సేనల వైఖరి ఐసిస్ తీవ్రవాదుల చర్యలను పోలి ఉందని వ్యాఖ్యానించారు. మేయర్ ఇవాన్ ఫెదొరోవ్‌ను రష్యన్ బలగాలు తీసుకెళ్లాయని ఉక్రెయిన్ అధికారి తెలిపారు. రష్యన్లు మేయర్‌ను అపహరించి యుద్ధ నేరానికి పాల్పడ్డారని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital