రష్యా బలగాలు క్షిపణి దాడులతో ఉక్రెయిన్‌లోని నగరాలను నేలమట్టం చేశాయి. దీంతో ఆయా నగరాల్లో వేలాది మంది మృతి చెందారు. తూర్పు ఉక్రెయిన్ దిశగా దాడులు జరిపిన రష్యా బలగాలు ఆయా ప్రాంతాల్లోని ఉక్రెయిన్ దాడులను నిరోధించేలా తమ కార్యకలాపాలను తీవ్రతరం చేసింది రష్యా. అదీగాక ఉక్రెయిన్ సైన్యాన్ని నిరోధించేలా దాడులు తీవ్రతరం చేయమని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయింగ్ ఆదేశించారు కూడా. ఈ మేరకు రష్యా, భూ, వాయు, జల మార్గాల్లో దాడులను వేగవంతం చేసింది.
ప్రస్తుతం డోనెట్స్‌కు తూర్పు ప్రాంతమైన ఉక్రెయిన్‌లోని కీలక నగరం స్లోవియెన్స్క్‌పై దాడి చేసేందుకు రష్యా బలగాలు రెడీ అవుతున్నట్లు ఉక్రెయిన్ పేర్కొంది. ఈ మేరకు తూర్పు ఉక్రెయిన్ నుంచి దాడులకు తెగబడ్డ రష్యా ఒక్కో నగరాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంటూ .. తదుపరి దశ దాడులకు సన్నాహాలు చేస్తోంది. అంతే కాదు రష్యా దక్షిణ ఉక్రెయిన్‌లో ఆక్రమించిన ప్రాంతాల్లో రష్యా తన రక్షణ స్థానాలను పటిష్టం చేసుకుంటూ దాడులకు సమాయత్తమవుతుంది. మరోవైపు ఉక్రెయిన్ కూడా పశ్చిమ దేశాలు అందించిన ఆయుధాల సాయంతో సుమారు 30 రష్యన్ లాజిస్టిక్స్, మందుగుండు సామాగ్రి కేంద్రాలపై విజయవంతమైన స్ట్రైక్ సింగ్ జరిపింది. దీనికి ప్రతిస్పందనగా రష్యా దాడులను తీవ్రతరం చేయడమే కాకుండా క్షిపణి దాడులతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడింది. ఏది ఏమైనా రష్యా ప్రత్యేక సైనిక చర్యగా చెప్పుకుంటగూ ఉక్రెయిన్‌ని మట్టికరిపించే దిశగా విధ్వంసకర దాడులకు తెగబడుతుంది.
చర్చలతోనే సమస్యకు పరిష్కారం: భారత్
ఉక్రెయిన్ లో కొనసాగుతున్న పరిస్థితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్దం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని యుఎన్‌ఎస్‌సి అరియా ఫార్ములా సమావేశంలో ఇండియా ప్రతినిధి ప్రతీక్ మాథూర్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారన్నారు. భయంతో ఉక్రెయిన్ ప్రజలు పొరుగు దేశాలకు వలస వెళ్తున్నారని ఆయన తెలిపారు. శాంతి మార్గంలో రష్యా వ్యవహరించాలని భారత్ ప్రతీ వేదికపై చెబుతుందని గుర్తు చేశారు. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ప్రతీక్ మాథూర్ దౌత్యపరమైన చర్చలకు తాము మద్దతిస్తామన్నారు. ఐక్యరాజ్య సమితి లోపల, బయట నిర్మాణాత్మకంగా వ్యవహరించడం భారత్ పని అని ప్రతీక్ మాథుర్ అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.