ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో ఆంక్షలతోను, ఆర్థిక సంక్షోభంతోనూ, దౌత్యపరంగా ఒంటరై విలవిలలాడుతున్న రష్యాకు అండగా చైనా నిలిచింది. దౌత్యపరమైన రక్షణ కల్పించే కీలక ప్రకటన చేసింది. జీ-20లో రష్యా కీలక సభ్యదేశమని, ఆ గ్రూప్‌నుంచి సభ్యదేశాలేవీ రష్యాను బహిష్కరించలేవని, ఆ హక్కు ఎవరికీ లేదని కుండబద్దలుకొట్టింది. అంతర్జాతీయ ఆర్థిక సహకారంలో గ్రూప్ 20 ముఖ్యభూమిక పోషిస్తోందని, అందులో రష్యా కీలమని, దానినుంచి ఎవరూ తప్పించలేరని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధివాంగ్ వెన్‌బిన్ బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు. పొరుగుదేశంపై దురాక్రమణకు పాల్పడిన రష్యాను అంతర్జాతీయ వేదికలనుంచి తొలగించే దిశగా అమెరికా ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని వాషింగ్టన్‌లోని భద్రతాసలహాదారు ఒకరు మంగళవారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో చైనా ఈ ప్రకటన చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement