Sunday, November 24, 2024

ఉక్రెయిన్‌లో దాడులను తీవ్రతరం చేస్తోన్న రష్యా.. చమురు, ఆహార డిపోలు ధ్వంసం…

కీవ్‌: ఉక్రెయిన్‌లో రష్యా దండయాత్ర బీభత్సం కొనసాగుతూనే ఉంది. నిన్నటిదాకా సైనిక స్థావరాలు, పౌర ఆవాసాలను లక్ష్యంగా చేసుకున్న పుతిన్‌ సేనలు, ఇప్పుడు చమురు నిలలు, ఆహార గోదాములపైకి క్షిపణులు సంధిస్తున్నాయి. రష్యా తన పూర్తి స్థాయి సాయుధ దురాక్రమణతో కొనసాగుతోందని, ఉక్రెయిన్‌ నగరాలపై రాత్రిపూట రాకెట్‌ దాడులు జరుగుతోందని ఉక్రెయిన్‌ సైనిక అధిపతులు ఆదివారం తెలిపారు. ఎలివ్‌ నగరంలోని ఇంధనం, ఆహార నిల్వ డిపోలపై రష్యా క్షిపణులు దాడి చేశాయని పేర్కొన్నారు. భారీ మంటలు చెలరేగాయి. ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారని వెల్లడించారు. సైట్‌లోని సెక్యూరిటీ గార్డు యారోస్లావ్‌ ప్రోకోపివ్‌, తాను మూడు రాకెట్లు దాడి చేసి రెండు చమురు ట్యాంకులను ధంసం చేయడం చూశానని చెప్పాడు. మూడో క్షిఫణి దాడిలో తాను నేలపై కూలిపోయానని చెప్పాడు. సౌకర్యాలపై దాడి అంటే సమీప భవిష్యత్తులో ప్రభుత్వం ఈ రెండింటి నిలలను చెదరగొట్టాల్సి ఉంటుందని ఉక్రెయిన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహాదారు వాడిమ్‌ డెనిసెంకో తెలిపారు.

రష్యా ఉక్రేనియన్‌ సరిహద్దుకు భ్రమణంలో బలగాలను తీసుకు వస్తోందని, ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి కొత్త ప్రయత్నాలు చేయవచ్చని డెనిసెంకో చెప్పారు. పౌరులే లక్ష్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఖార్కీవ్‌లో ఆహారం కోసం క్యూలో నిల్చున్న పౌరులపై రష్యా బాంబు దాడిలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లీవ్‌ నగరంపై శనివారం రష్యా రెండు రాకెట్‌ దాడులు చేసింది. ఈ ఘటనల్లో ఐదుగురికి గాయాలయ్యాయి. మేరియుపోల్‌లో పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయని, నగరంలో వీధి పోరాటాలు జరుగుతున్నాయని నగర మేయర్‌ తెలిపారు.

ఉక్రేనియన్ల ప్రతిఘటనలో రష్యా ఏడో జనరల్‌ మృతి..

ఖేర్సన్‌ సమీపంలో జరిపిన దాడిలో రష్యాకి చెందిన లెప్టినెంట్‌ జనరల్‌ యాకోవ్‌ రెజాన్‌త్సెవ్‌ మృతిచెందినట్టు ఉక్రెయిన్‌ రక్షణశాఖ వెల్లడించింది. వాయువ్య ఉక్రెయిన్‌లోని జైతోమిర్‌ నగర సమీపాన ఉన్న ఆయుధ డిపోను నాలుగు క్యాలిబర్‌ క్షిపణులతో ధ్వంసం చేశామని రష్యా తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా తన దాడులను కొనసాగిస్తున్నందున, దేశంలోని తూర్పు ప్రాంతంలోని వేర్పాటువాద ప్రాంతాలలో పోరాడుతున్న ఉక్రేనియన్‌ దళాలను చుట్టుముట్టడానికి రష్యా దళాలు ప్రయత్నిస్తున్నాయని బ్రిటిష్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లు తెలిపారు. ఉక్రేనియన్‌ దళాలను చుట్టుముట్టే ప్రయత్నంలో వ్లాదిమిర్‌ పుతిన్‌ బలగాలు ఖార్కివ్‌ నగరం చుట్టుపక్కల ప్రాంతం నుండి దక్షిణం వైపునకు, ఉత్తరాన ఓడరేవు నగరం మేరియుపోల్‌ నుండి డాన్‌బాస్‌ ప్రాంతానికి పురోగమిస్తున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఇంటెలిజెన్స్‌ బ్రీఫింగ్‌లో తెలిపింది. డోనెట్స్క్‌, లుహాన్స్క్‌ తూర్పు ప్రాంతాలలో ఏడు దాడులను ఉక్రేనియన్‌ బలగాలు తిప్పికొట్టాయిష. అనేక ట్యాంకులు, సాయుధ వాహనాలను ధ్వంసం చేశాయని సాయుధ దళాల జనరల్‌ స్టాఫ్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement