ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై అగ్రరాజ్యం అమెరికా అనేక కఠిన ఆంక్షలకు దిగింది. ఇందులో వ్యక్తిగత ఆంక్షలూ ఉన్నాయి. ఈ చర్యలకు మాస్కో ప్రతిచర్యలు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ ఇతర ప్రభుత్వ అధికారులపై వ్యక్తిగత ఆంక్షలు విధించింది. తద్వారా ప్రతీ కారం తీర్చుకుంది.
ఈ మేరకు మంగళవారం రష్యా విదేశాంగశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. యూఎస్ విదేశాంగ కార్యదర్శి బ్లింకెన్, డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మార్క్‌మిల్లి తదితరులు ఉన్నారు. కెనడా అధ్యక్షుడు ట్రూడోపైనా వ్యక్తిగత ఆంక్షలను మాస్కో ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..