విచారణ చేపట్టిన మెడికల్, బాంబ్ ఎక్స్‌పర్ట్స్
రక్తపు మడుగులో మృతదేహాలు గుర్తింపు
సర్య్కులేట్ అవుతున్న వీడియోలు, ఫొటోలు
వివరాలు వెల్లడించని రష్యా దర్యాప్తు సంస్థ
ఆంధ్రప్రభ స్మార్ట్, మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో మంగళవారం అనుమానిత ఐఈడీ పేలుడు సంభవించింది. నగరంలోని రాజన్‌స్కీ ప్రాస్పెట్ ప్రాంతంలో ఉన్న ఓ బిల్డింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. పేలుడుతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఆ ఘటన ఎందుకు జరిగిందన్న దానిపై రష్యా దర్యాప్తు సంస్థ ఇంకా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతం పేలుడు జరిగిన ప్రదేశంలో ఫోరెన్సిక్ నిపుణులు సమాచారం సేకరిస్తున్నారు. మెడికల్, బాంబు ఎక్స్‌పర్ట్స్ దర్యాప్తు చేపట్టనున్నారు. సైడ్‌వాక్ వద్ద ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు ఉన్నట్లు అనేక వీడియోలు, ఫొటోల ఆధారంగా తెలిసింది. మృతదేహాల వద్ద రక్తం వరదలా కనిపించింది. అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లో విండోలు, బ్రిక్‌వర్క్ ధ్వంసమైన ఫూటేజ్ కూడా రిలీజైంది.
కెమికల్ డిఫెన్స్ చీఫ్ మృతి..
లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ మృతిచెందినట్లు రష్యా ప్రభుత్వం ద్రువీకరించింది. రేడియోలాజికల్ కెమికల్ అండ్ బయోలాజికల్ డిఫెన్స్ దళాల చీఫ్ ఆ పేలుడు మృతిచెందినట్లు పేర్కొన్నారు. బిల్డింగ్ ఎంట్రెన్స్ వద్ద పార్క్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో పెట్టిన ఐఈడీని రిమోట్‌తో పేల్చినట్లు తెలుస్తోంది. 54 ఏళ్ల కిరిల్లోవ్.. 2017 నుంచి రష్యా కెమికల్ డిఫెన్స్ చీఫ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. యుద్ధక్షేత్రంలో రసాయనిక ఆయుధాలు వాడడంలో కిరిల్లోవ్ నిష్ణాతుడు. ఉక్రెయిన్‌లో ఉన్న అనేక ల్యాబ్‌లను అమెరికా ఆపరేట్ చేస్తున్నట్లు ఆయన గతంలో ఆరోపించారు.