రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు పోలింగ్ కొనసాగనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రష్యన్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో భాగంగా భారత్‌లోనూ ఓ పోలింగ్ కేంద్రంలో అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్ జరిగింది. తిరువనంతపురంలోని రష్యన్ హౌస్‌లో ఉన్న రష్యన్ ఫెడరేషన్ గౌరవ కాన్సులేట్ వద్ద ప్రత్యేకగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. దీంతో కేరళలో నివసిస్తున్న ఆ దేశ పౌరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌లో రాష్ట్రంలో కూడా ఓటింగ్ జరిగింది.
రష్యా అధ్యక్ష ఎన్నికలకు కేరళలో ఓటింగ్‌ను ఏర్పాటు చేయడం ఇది మూడోసారి అని రష్యన్ హౌస్ డైరెక్టర్ రతీష్ నాయర్ అన్నారు. పోలింగ్ విజయవంతంగా జరగడానికి సహకరించిన రష్యాన్లను ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేరళలోని రష్యన్ జాతీయులు, పర్యాటకుల కోసం దీనిని ఏర్పాటు చేశామని చెప్పారు. ఇది రష్యన్ ఫెడరేషన్ కేంద్ర ఎన్నికల సంఘంతో అనుబంధం కలిగి ఉండటం ఆనందంగా ఉందన్నారు.