డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత పతనమైంది. ఈనెలలో ఫెడరల్ బ్యాంక్ 100 బేసిక్ పాయింట్ల మేర వడ్డీరేట్లు పెంచుతుందన్న ఆందోళన నేపథ్యంలో రూపాయి మారకం విలువ భారీగా పతనమైంది. గురువారం సాయంత్రానికి రూపాయి విలువ 80.03 పైసలుగా నమోదైంది. మార్కెట్ ప్రారంభం కాగానే ఉదయం 79.64 వద్ద ప్రారంభమై 80 పైసల మార్క్‌ను దాటింది. 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా బుధవారం యూరో, అమెరికన్ డాలర్ల విలువ సమానంగా మారిన నేపథ్యంలో రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉందని హెచ్‌డీఎప్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ పేర్కొన్నారు.
అమెరికాలో ధరలు గడచిన నలభై ఏళ్ల గరిష్టంగా పెరిగాయి. ఈ ఏడాది జూన్‌లో అంచనాలకన్నా అధికంగా 9.1 శాతం మేర ధరల పెరుగదుల నమోదైంది. ఈ నేపథ్యంలో ఈనెల 26-27 తేదీల్లో భేటీ కానున్న ఫెడ్ వడ్డీరేట్లు పెంచుతుందన్నది మదుపరుల ఆందోళన. అమెరికా సెంట్రల్ బ్యాంక్ 2022లో 150 పాయింట్ల మేర వడ్డీరేట్లు పెంచిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.