యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు వద్ద ఘోర ప్రమాదం తప్పింది. రన్నింగ్ లో ఉండగానే బస్సు వెనక చక్రం ఊడిపోయింది. ఆకస్మాత్తుగా వెనక చక్రం ఊడిపోవడంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమయి డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సు స్పీడ్ ని కంట్రోల్ చేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాటేపల్లి వద్ద మోత్కూరు ప్రధాన రహదారిపై జరిగింది ఈ ఘటన. హైదరాబాద్ నుంచి బస్సు తొర్రూరు వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రాణనష్టం తప్పడంతో ప్రయాణికులు, ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం..