Monday, November 18, 2024

స‌బ్​ అర్బ‌న్ రూట్ల‌లో బస్సులు నడపండి.. ప్ర‌యాణికుల విజ్ఞ‌ప్తి

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి: గ్రేటర్‌ ఆర్టీసీ పరిధిలో సబ్‌ అర్బన్‌ ఏరియాల్లో ఆక్యూపెన్సి లేదన్న కారణంగా వందలాది గ్రామాలకు బస్సులను గ్రేటర్‌ ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. ఫలితంగా విద్యార్థులు, కూరగాయలు అమ్ముకునే వారు, చిన్నా చితక కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు అష్ట కష్టాలు పడుతున్నారు. రద్దు చేసిన బస్సులను పునరుద్ధరించాలని సబ్‌ అర్బన్‌ గ్రామాల ప్రజల విజ్ఞప్తిని అధికారులు పట్టించుకోవడం లేదా ప్రజా రవాణా వ్యవస్థను పాలక వర్గాలు లాభనష్టాలతో సంబంధం లేకుండా నడపాలి. కాని గ్రేటర్‌ ఆర్టీ సీ అధికారులు అక్యూపెన్సీ, కేఎం పీల్‌ ప్రాతిపది కన బస్సులను నడుపుతున్నారు. ఫలితంగా గ్రేటర్‌ పరి ధిలోని అనేక బస్సు సర్వీసులు రద్దయ్యాయి. కొవిడ్‌కు ముందు వరకు నగరంతో పాటు అన్ని సబ్‌ అర్బన్‌ గ్రామాలకు బస్సు సర్వీసు లుండేవి. కొవిడ్‌ తర్వాత సబ్‌ అర్బన్‌ పరిధిలో వందలాది గ్రామాలకు సిటీ బస్సులను రద్దు చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 2021 సంవత్సరం లో 3700 బస్సులతో ప్రతి రోజు 42వేల ట్రిప్పు లను నడిపి 35 లక్షలమంది..

ప్రయాణకులను గమ్యం చేర్చేది గ్రేటర్‌ జోన్‌ టీఎస్‌ఆర్టీసీ.

ఏడాదిన్నర కాలంలో వాటిని 2800కు కుదించడంతో 12వేల ట్రిప్పులు తగ్గాయి. ఫలితంగా శివారు ప్రాంతాలకు బస్సు ట్రిప్పులు తగ్గాయి. ప్రతి రోజు 15 ట్రిప్పులు వెళ్లాల్సిన రూట్లలో 10 ట్రిప్పులకు పరిమితం చేశారు. ఒకటి రెండు ట్రిప్పులు వెళ్లాల్సిన రూట్ల లో మొత్తానికి రద్దు చేశారు. ఇంజినీరింగ్‌, మెడికల్‌ కాలేజీల్లో సింహభాగం శివారు ప్రాంతాల్లో ఉండటంతో గ్రామాల నుంచి కాలేజీలకు వచ్చే విద్యా ర్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉషారుపల్లి అని కాకుండా గ్రేటర్‌ పరిధిలో రద్దు చేసిన అన్ని సబ్‌అర్బన్‌ సర్వీసులను తిరిగి పున రుద్ధరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement