మల్టీ టాలెండెట్ హీరో లారెన్స్ ‘చంద్రముఖి 2 తో పాటు రుద్రుడు’ అనే సినిమాను కూడా పట్టాలెక్కించాడు. తమిళంతో పాటు తెలుగు .. కన్నడ .. మలయాళ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కథిరేసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి, లారెన్స్ బర్త్ డేను పురస్కరించుకుని ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. యాక్షన్ సీన్ ప్రధానంగా సాగిన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. లారెన్స్ జోడీగా ప్రియా భవానీ శంకర్ నటిస్తున్న ఈ సినిమాలో, శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే ఏప్రిల్లో ఈ సినిమాలు విడుదల చేయనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement