Friday, November 22, 2024

విదేశీ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ తప్పనిసరి.. కొవిడ్‌ మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం

చైనాతో సహా పలు దేశాల్లో కొవిడ్‌ ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారంనాడు చైనాతో సహా ఆరుదేశాల ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ విమానాలలో వచ్చే ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరి చేసింది. ఈ మేరకు సవరించిన కొవిడ్‌ మార్గదర్శకాలను కేంద్ర పౌరవిమానాయాన శాఖ జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణీకులకు మాత్రమే మార్పులు, బోర్డింగ్‌ పాస్‌లను జారీ చేయడానికి విమానయాన సంస్థలు తమ చెక్‌-ఇన్‌ కార్యాచరణలను సవరించాలని ఆదేశించినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశానికి వచ్చే ఈ అంతర్జాతీయ ప్రయాణికులు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష రిపోర్టుతో పాటు స్వీయ-డిక్లరేషన్‌ ఫారమ్‌ను సమర్పించాలని వెల్లడించింది.

- Advertisement -

చైనాలో కరోనా విజృంభణపై డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ ఆందోళన

చైనాలో కరోనా విజృంభిస్తున్నది. వైరస్‌ వ్యాప్తి తీవ్ర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. చైనాలో కరోనా నియంత్రణ, హైరిస్క్‌ ఉన్న వ్యక్తులకు వ్యాక్సినేషన్‌పై చర్యలు చేపట్టాలని సూచించారు. చైనా ఆరోగ్య వ్యవస్థల పరిరక్షణకు తమ వంతు సహాయసహకారాలు అందజేస్తామని చెప్పారు. మరోవైపు చైనాలో నమోదవుతున్న కరోనా కేసులు, వేరియంట్ల గురించిన సమాచారాన్ని ఇవ్వాలని ఇటీవల ఆయన పిలుపునిచ్చారు. కరోనా గురించి అర్థం చేసుకోవడంలో ఏర్పడే గ్యాప్‌ వల్ల భవిష్యత్తులో సంభవించే మ#హమ్మారిలను అర్థం చేసుకోవడం, ఎదుర్కోవడం కష్టంగా ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement