Friday, November 22, 2024

ఆర్టీసీ సమ్మె.. 6 వేల మంది సస్పెండ్‌..

ఆర్టీసీ స‌మ్మెతో మ‌హారాష్ట్ర‌లో బ‌స్సులు నిలిచిపోయాయి. ర‌వాణా సంస్థ‌ను రాష్ట్ర ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌న్న డిమాండ్‌తో ఉద్యోగులు నెల రోజుల నుంచి స్ట్రైక్‌ చేస్తున్నారు. దీంతో చిర్రెత్తిన యాజ‌మాన్యం ఆరు వేల మందిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులపై ఆర్టీసీ మండిపడింది. వారిపై క్రమ శిక్షణ చర్యలకు దిగింది. ఇందులో భాగంగా నిన్న 3,010 మంది ఉద్యోగులను సస్సెండ్ చేసింది. మరో 270 మంది కార్మికులను విధుల నుంచి తొలగించింది. అంత‌కుముందు కూడా కొంద‌రిని సస్సెండ్ చేయ‌డంతో మొత్తం స‌స్పెన్ష‌న్‌కు గురైన ఉద్యోగుల సంఖ్య 6,277కి చేరింది.

ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆర్టీసీ కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలని, లేకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొత్తం 92,266 మంది ఆర్టీసీ ఉద్యోగుల్లో 18 వేల మంది దాకా విధుల్లో చేరారు. ఇంకొందరు డ్యూటీలో చేరేందుకు ఈ రోజు వరకు సమయం ఇచ్చింది ప్రభుత్వం. అలాగే ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో సమీక్షించాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వారం ప్రారంభంలో ప్రభుత్వం జీతాల పెంపును ప్రకటించడంతో పలువురు ఉద్యోగులు విధుల్లో చేరేందుకు సముఖత వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement