Saturday, November 23, 2024

ఈ సేవల దిశలో ఆర్టీసీ.. త్వరలోనే దూర ప్రాంత సర్వీసులలో వినియోగం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆండ్రాయిడ్‌ ఆధారిత సేవలను అందించేందుకు ఆర్టీసీ సన్నద్దమైంది. ప్రయాణికులకు మరింత సౌలభ్యంగా ఉండేందుకోసం ఆర్టీసీ ఇంటెలీజెన్స్‌ టికెట్‌ ఇష్యూ మిషన్‌ (ఐ – టిమ్స్‌) విధానాన్ని అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దూర ప్రాంతాలకు వెళ్ళే బస్సులలో త్వరలోనే ఐ – టిమ్స్‌ మిషన్‌లను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం 928 ఐ – టిమ్స్‌ మిషన్లను కొనుగోలు చేశారు. ఐ – టిమ్స్‌ మిషన్లను అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.

బస్టేషన్‌ నుంచి బస్సు బయలు దేరే 15 నిమిషాల ముందు ప్రయాణికులు తమ టికెట్లను బుక్‌ చేసుకునే సౌలభ్యం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దూర ప్రాంతాలకు వెల్ళే బస,ు్సలలో గంట ముందు ఆన్‌లైన్‌ టికెట్ల బుకింగ్‌ను అధికారులు నిలిపి వేస్తున్నారు. ఐ – టిమ్స్‌ ప్రవేశ పెట్టడం ద్వారా ప్రయాణికుల సమయం ఆదా చేయడంతో పాటు బస్సులో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎంత సమయంలో బస్సు గమ్యస్థానం చేరుతుందనే విషయాలు ముందుగానే తెలుసుకునేందుకు వీలుంటుంది. ఐ – టిమ్స్‌ ద్వారా ప్రయాణికులు బస్సులో యుపిఐ ద్వారా కానీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులకు వీలుంటుంది. త్వరలోనే స్మార్ట్‌ కార్డులను ప్రవేశపెట్టబోతున్నామని, ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రివార్డ్‌ పాయింట్లను అమలు చేయాలని భావిస్తున్నామని అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement