తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమక్షంలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. పొత్తు రద్దు చేసుకోవాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఒత్తిడి తెచ్చారన్నారు. అయితే, అది తనకు ఇష్టం లేదని.. మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉండాలనే బీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
ఇక, నీది పాలమూరే.. నాది పాలమూరే అటూనే.. రేవంత్‌రెడ్డి తనను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. మా కార్యకర్తలు ఆర్థికంగా పేదలు కావచ్చు.. కానీ సైద్ధాంతికంగా పేదలు కాదన్నారు. నలుమూలలు తిరిగి బహుజన వాదాన్ని ప్రచారం చేస్తామని.. వీళ్లందరినీ రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బాల్క సుమన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.