భారతీయ రాష్ట్ర సమితి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12న కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ డిగ్రీ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.
తెలంగాణ భవన్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో బీఆర్ఎస్ అధినేత ఇవ్వాల (ఆదివారం) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో భాగంగా రోడ్‌షోలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో తానే స్వయంగా పాల్గొనన్నట్లు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 12న కరీంనగర్ లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల స్థాయిలోనూ పార్టీ సమావేశాలు నిర్వహించాలని నాయకులకు సూచించారు. బస్సు యాత్రలు చేద్దామని నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.