హౌసింగ్ కాంప్లెక్స్ లో తీసుకొచ్చి వీధికుక్కలకు ఆహారం పెట్టిందన్న కారణంతో ఓ మహిళపై రూ.8 లక్షల జరిమానాను ఆ కాంప్లెక్స్ యాజమాన్య సంఘం విధించింది. నవీముంబయిలో 40 భవనాలతో కూడిన ఎన్ఆర్ఐ కాంప్లెక్స్ లో ని ఓ మహిళకు ఈ చేదు అనుభవం ఎదురైంది. రోజుకు రూ.5వేల చొప్పున ఆమెపై జరిమానా విధిస్తూ రాగా ఆ మొత్తం ఇప్పటికి రూ.8 లక్షలకు చేరింది. ఈ ఏడాది జులై నుంచి ఈ జరిమానా విధానం అమల్లోకి తీసుకువచ్చారని బాధిత మహిళ అన్షు సింగ్ మీడియాకు తెలిపారు.
తనలాగే మరో మహిళకు కూడా ఇలా రూ. లక్షల రూపాయల జరిమానా విధించారని ఆమె తెలిపారు. కాంప్లెక్స్ లోకి కుక్కలు వచ్చేస్తూండటంతో పిల్లలు, వృద్ధులకు సమస్యలు ఎదురవుతుకన్నాయని కాంప్లెక్స్ నివాసితుల సంఘం ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదని కార్యదర్శి వినిత శ్రీనందన్ చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital