వాణిజ్య అవసరాలకు కోసం హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర విభాగాల్లో వినియోగించే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం 36 రూపాయలు తగ్గించింది. ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 19,76.50 రూపాయలు ఉంది. దీనితో ఈ సంవత్సరం మే నెల నుంచి ఇప్పటి వరకు కమర్షియల్ సిలిండర్‌పై 377.50 రూపాయలు తగ్గించినట్లు అయ్యింది.
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లిలో 10,53 రూపాయలుగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పన్నుల నుంచి ఈ రేటు మారుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.